స్టార్ హీరో రానా దగ్గుబాటి ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు పూర్తైంది. ఈ విషయాన్ని రానా ట్వీట్‌ ద్వారా తెలియజేశాడు. అర్జున్‌ ప్రసాద్‌(లీడర్‌) నుంచి డేనియల్‌ శంకర్‌(భీమ్లా నాయక్‌) వరకు.. అప్పుడే 12 ఏళ్లు పూర్తయ్యాయి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.. మున్ముందు కూడా కొత్త కొత్త కథలు, పాత్రలను మీకు పరిచయం చేస్తాను' అని హామీ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు రానాకు శుభాకాంక్షలు చెప్తూ ఆయన చేసిన సినిమాల్లో తమకేది ఎక్కువ ఇష్టం అనేది చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే స్వీటీ అనుష్క శెట్టి రానా ట్వీట్‌ 'ఇలాగే ముందుకు సాగు బ్రో' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన జనాలు స్వీటీ తన అన్నయ్యకు రిప్లై ఇచ్చిందిరో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)