ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎల్లుండి విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో కన్నడిగులు ఈ సినిమాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కన్నడ భాషలో విడుద‌ల అవ్వ‌ట్లేద‌ని, త‌మ భాష‌లో ఆ సినిమా విడుద‌ల కాన‌ప్పుడు ఇత‌ర భాష‌ల్లోనూ ఆడ‌కుండా క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవ‌ల కర్ణాటకలోనూ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. దీనికి క‌ర్ణాట‌క సీఎం బొమ్మై కూడా వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ, ఈ సినిమాను కన్నడ భాషలో విడుడ‌ల చేయ‌లేక‌పోతుండ‌డంతో ఇది త‌మ భాష‌ను అవమానించడమేనని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అంటున్నారు. ఇందుకు సంబంధించిన BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)