స‌ల్మాన్ షూటింగ్ నుంచి ఏ మాత్రం బ్రేక్ దొరికినా ఇత‌ర స్టార్ హీరోలను క‌లుస్తున్నాడు. ప్రైవేట్ పార్టీల‌కు హాజ‌ర‌వుతున్నాడు. ఇండ‌స్ట్రీలో చాలా ఏండ్ల నుంచి మంచి అనుబంధం కొన‌సాగిస్తున్న‌ కోస్టార్లు, వారి ఫ్యామిలీస్‌ను క‌లుస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో టాలీవుడ్ హీరో రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల‌(Ram Charan-Upasana )ను క‌లిశాడు. స‌ల్మాన్, పూజాతోపాటు వెంక‌టేశ్ కూడా చర‌ణ్ క‌పుల్‌ను క‌లిసిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కాగా క‌భీ ఈద్ క‌భీ దివాళి చిత్రంలో వ‌చ్చే స్పెష‌ల్ సాంగ్‌లో రాంచ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. తాజాగా రాంచ‌ర‌ణ్‌తో స‌ల్మాన్‌, పూజా కనిపించ‌డం ఈ ఊహాగానాలు నిజ‌మేన‌ని చెప్తున్నాంటున్నారు సినీ జ‌నాలు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా..విక్ట‌రీ వెంక‌టేశ్ కీ రోల్ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Rhyme (@alwaysrhyme)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)