బాలీవుడ్ యాక్టర్ శక్తి కపూర్ కుమారుడు, నటి శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో పాజిటివ్ రావడంతో బెంగళూరులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి బెంగళూరులో ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగిన ఓ పార్టీలో నిషేదిత డ్రగ్స్‌ను వాడుతున్నారన్న పక్కా సమాచారంతో నగర పోలీసులు దాడులు చేశారు. ఇందులో డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో బాలీవుడ్ నటి, సాహో మూవీ ఫేం శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఆరుగురు ప్రముఖులను సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వీళ్లందరికీ పోలీసులు రక్త పరీక్షలు నిర్వహించగా.. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని సమాచారం.

శ్రద్దా కపూర్ సోదరుడైన సిద్దాంత్ కపూర్.. 1997లో వచ్చిన 'జుడ్వా' అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారి ఎన్నో సినిమాలకు పని చేశాడు. ఈ క్రమంలోనే 2013లో వచ్చిన 'షూటౌట్ ఎట్ వాడాలా' అనే సినిమాతో నటుడిగా మారాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే 'అగ్లీ', 'హసీనా పార్కర్', 'పల్టన్', 'యారమ్', 'హలో చార్లీ' వంటి సినిమాల్లో నటించాడు. అలాగే, 'భవుక్కల్' అనే వెబ్ సిరీస్‌లో కూడా భాగం అయ్యాడు. వీటితో పాటు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌లను కూడా చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)