జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గాలోడు' రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. "అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు .. కానీ నేను ఈ రెండిటినీ నమ్ముకోను .. నన్ను నేను నమ్ముకుంటాను" అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. టైటిల్ చూస్తేనే ఇది పక్కా మాస్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. అందుకు తగినట్టుగానే విజువల్స్ ఉన్నాయి. మాస్ యాక్షన్ సీన్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. డిఫరెంట్ లుక్ తో సుధీర్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో సప్తగిరి .. పృథ్వీ కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)