సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. రేపు పద్మాలయ స్టూడియో, అనంతరం కృష్ణ పార్థివ దేహానికి మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుపబడతాయని తెలుస్తోంది.
టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)