తెలుగు చిత్ర సీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్‌’, అలాగే ధనుష్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించిన నారాయణ దా కె నారంగ్‌ మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)