సీనియర్‌ నటుడు కైకాల 87వ బర్త్‌డే సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయన జన్మదిన వేడుకను నిర్వహించారు. ఇందుకోసం స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి బెడ్‌పైనే ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు షేర్‌ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్‌ చేస్తూ.. ‘పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. కాగా కైకాల ప్రస్తుతం వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు. ఆయన కనీసం నిలబడి లేని, కదలలేని స్థితిలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)