ప్రముఖ టాలీవుడ్‌ సినీ నిర్మాత ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ వెంకట్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆర్‌.ఆర్‌ బ్యానర్స్‌పై ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్, బిజినెస్‌మెన్, డమరుకం, పైసా వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను ఆయన నిర్మించారు. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'డైవర్స్ ఇన్విటేషన్' అనే ఒక హాలీవుడ్ సినిమాని కూడా నిర్మించారు. వెంకట్‌ మృతి పట్ల హీరో రవితేజ, డైరెక్టర్లు శ్రీను వైట్ల, సురేందర్‌ రెడ్డి సమా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)