సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ కళావతి పాట ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకు వీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీంతో షాక్‌కి గురైన మేకర్స్‌ రంగంలోకి దిగారు. పాటను లీక్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా వాలైంటైన్స్‌ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా ఆన్‌లైన్‌ లీక్‌ నేపథ్యంలో నేడు(ఆదివారం)అధికారికంగా పాటను విడుదల చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)