కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజా మూవీతో ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ప్రస్తుతం విజయ్ ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగాఉప్పెన ఫేమ్ కృతిశెట్టిపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో సినిమాలు ఒప్పుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలుగు నటి హేమ అరెస్ట్, సీసీబీ పోలీసులు ఎదుట హాజరైన వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనని చెప్పా. కూతురిగా భావించిన కృతిశెట్టితో నటించడం నా వల్ల కాదు' అని అన్నారు. కాగా.. గతంలోనూ విజయ్ సేతుపతి ఇదే విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయగా తిరస్కరించారు.
Here's News
Why Vijay Sethupathi refused to act with Kriti Shetty as his pair… 👇 pic.twitter.com/R6Gp9DarBB
— Christopher Kanagaraj (@Chrissuccess) September 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)