వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియోపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఈ సినిమా షూటింగ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలిపే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైమ్ పాస్. ఎప్పుడూ కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం.’ అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదాస్పదం అవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)