కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ నెల 3 నుంచి 10 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఆ తరువాత 10 నుంచి 17 వరకు పొడిగించింది. నిబంధనల మేరకు రేపటితో లాక్‌డౌన్ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఒక్కరోజే హర్యానాలో 9వేలకుపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 144 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసులు 6.85 లక్షలకు చేరాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
Mahamari Alert / Surkshit Haryana extended from 17 May to 24 May Stringent measures will be taken to implement the Alert.
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 16, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)