పెరుగుతున్న కోవిడ్‌ కేసుల దృష్టా కేం‍ద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్‌ వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ మంగళవారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. కోవిడ్‌ విజృంభణ వల్ల పరీక్ష వాయిదా వేస్తున్నామన్నారు. ఇప్పటికే నీట్‌ పరీక్ష వాయిదా వేసిన సంగతి విదితమే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)