సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, నర్సాపూర్, శ్రీకాకుళం మధ్య జనవరి 12, 13, 14 తేదీల్లో సర్వీసులందించనున్నాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్‌ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సాధారణ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ వేదికగా తెలిపింది. అలాగే సంక్రాంతి రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లలో తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవిగో,,
హైదరాబాద్ - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు (07178) జనవరి 12న రాత్రి 9.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.45గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.
శ్రీకాకుళం రోడ్ - హైదరాబాద్ ప్రత్యేక రైలు (07179) జనవరి 13న శ్రీకాకుళంలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్‌కు రానుంది.
సికింద్రాబాద్ - నర్సాపూర్ ప్రత్యేక రైలు (07176) జనవరి 13న రాత్రి 10.05గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10గంటలకు నర్సాపూర్ చేరుకోనుంది.
నర్సాపూర్ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07177) జనవరి 14న సాయంత్రం 6గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.50గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది.
Heres' Tweet
Temporary augmentation of trains with additional coaches during Sankranthi festival season @RailMinIndia @drmsecunderabad @drmgtl @drmgnt @drmvijayawada pic.twitter.com/9VtKiDWgMP
— South Central Railway (@SCRailwayIndia) January 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)