ఇండియాలో మళ్లీ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కవ భాగం కేరళలో వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చలికాలం కావడంతో ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. మరోవైపు సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలంతా తగు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. యూకేను కలవరపెడుతున్న కొత్త మహమ్మారి, దగ్గుతో డేంజర్ లో పడుతున్న ప్రజలు, 100 రోజుల దగ్గుతో జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
Here's News
166 new Covid cases reported in India, majority from Kerala https://t.co/qPtPHb1jjV
— Business Today (@business_today) December 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)