ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన మోదీ కాదు, పగ్లా మోదీ (Pagla Modi) అని విమర్శించారు. పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో అధీర్ రంజన్ మాట్లాడుతూ, మరోసారి అకస్మాత్తుగా ఆయన (ప్రధాని) రూ.2,000 నోట్లు రద్దు చేసినట్టు ప్రకటించారని, ఆయన మోదీ కాదని, పగ్లా మోదీ అని, ప్రజలు ఆయనను పగ్లా మోదీగా సంబోధిస్తు్న్నారని అన్నారు. దీనిపై ఆయన మళ్లీ వివరణ ఇస్తూ రూ.2,000 నోట్ల ఉపసంహరణపై ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ప్రజవాణిని మాత్రమే తాను చెప్పానని అన్నారు.

ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)