అగ్నిపథ్ స్కీమ్‌పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇవాళ ఓ ప్రకటన చేశారు. ఆర్మీ పరీక్ష కోసం సిద్దమవుతున్న యువతకు వయోపరిమితిని ఒకసారి పెంచే అవకాశం కేంద్రం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. రిక్రూట్మెంట్ ఏజ్‌ను 23 ఏళ్లకు పెంచినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు తమ దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందని, కోవిడ్ సమయంలోనూ తీవ్రంగా కష్టపడ్డ యువతకు ఇప్పుడు మంచి అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. గడిచిన రెండేళ్లు కోవిడ్ ఆంక్షల వల్ల ఆర్మీ రిక్రూట్మెంట్‌ను నిర్వహించలేదన్నారు. అయితే రిక్రూట్మెంట్‌కు చెందిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. భారతీయ యువత అగ్నివీరులుగా ఆర్మీలో చేరే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
This decision will provide an opportunity for many of our young, energetic & patriotic youth who, despite COVID pandemic, were preparing to join the recruitment rallies, which couldn't be completed in the last two years due to COVID restrictions: Army chief Gen Manoj Pande (2/3)
— ANI (@ANI) June 17, 2022
The schedule of the recruitment process will be announced shortly. We call upon our youth to avail this opportunity for joining the Indian Army as Agniveers: Army chief General Manoj Pande (3/3)
— ANI (@ANI) June 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)