సికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యలు కలకలం రేపాయి(Telangana Shocker). లాలాగూడలోని ఓ ఇంటి సంపులో మహిళ మృతదేహం దొరికింది. మృతురాలు జ్ఞానేశ్వరి (45)గా గుర్తించగా జవహర్‌నగర్‌లో జ్ఞానేశ్వరి తల్లి హత్యకు గురయ్యారు(Twin Murders).

ఇద్దరినీ అరవింద్, లక్ష్మి కలిసి హత్య చేసినట్టు గుర్తించారు జవహర్ నగర్ పోలీసులు. లక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యలు బయటపడ్డాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని తల్లి, కూతురును హత్య చేశారు అరవింద్. హత్య చేసిన అనంతరం యూపీకి పరారయ్యారు అరవింద్. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి మృతి 

ఇక మరో వార్తను పరిశీలిస్తే.. ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనతో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి.

Twin Murders Create Panic in Secunderabad Lalaguda

సికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యల కలకలం..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)