తెలంగాణలో వరుసగా న్యాయవాదులు గుండెపోటుతో మృతి చెందుతుండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది(Secunderabad Court). నిన్న హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు మృతి మరువక ముందే మరో న్యాయవాది హఠాన్మరణం కలవరం రేపింది.

సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో కుప్పకూలారు వెంకటరమణ(Lawyer Venataramana). తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు, ఆయన మృతికి సంతాపంగా అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపి వేసిన జడ్జిలు

ఇక నిన్న హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు(Lawyer Venugoalarao) గుండెపోటుతో మరణించారు. కోర్టు నెం.21లో న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తున్న న్యాయవాది పి. వేణుగోపాల్ రావు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కోర్టు గదిలో కుప్పకూలిపోయారు.వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

Another lawyer Venkataramana dies suddenly in Telangana court

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)