గుజరాత్‌కు చెందిన పాల కంపెనీ అమూల్‌ (Amul Milk) అన్ని రకాల ఉత్పత్తులపై రెండు రూపాయలు పెంచినట్లు ప్రకటించింది. ‘అమూల్‌’ బ్రాండ్‌తో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (GCMMF) ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. చివరిసారి అమూల్‌ 2023 ఫిబ్రవరిలో ధరలను సవరించింది. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల్ని సవరించాల్సి వస్తోందని జీసీఎంఎంఎఫ్‌ తెలిపింది.  పాల ధరను రెండు రూపాయలు పెంచిన మ‌ద‌ర్ డెయిరీ, అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 పెంచినట్లు వెల్లడి

తాజా పెంపుతో అమూల్ బర్రె పాల ధర లీటరుకు రూ.73కి చేరుకుంది. అర్ధ లీటర్‌ రూ.27గా అయింది. రూ.66గా ఉన్న అమూల్ గోల్డ్ ధర రూ.68కి, అమూల్ శక్తి రూ.60కి చేరాయి. అమూల్ తాజా పాల ధర లీటర్ రూ.56కు పెరగగా, అర్ధ లీటర్ రూ.28కి చేరింది. ఇక అమూల్ గోల్డ్ అర్ధ లీటర్ రూ.34, అమూల్ శక్తి అర్ధ లీటర్ రూ.30గా అయ్యాయి. గతంలో అమూల్‌ పాల ధరలు పెరగడంతో ఇతర కంపెనీలు కూడా పెంచాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)