సామాజిక మాధ్యమాలు సమాజానికి మంచి చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ‘‘కొందరు సైకోలు, సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. తల్లి, చెల్లి అనే ఇంగిత జ్ఞానం లేకుండా పోస్టులు పెట్టారు. మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షసానందం పొందారు. సోషల్ మీడియా బాధితుల్లో నేనూ ఉన్నా. పరువు, ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టారు. పైశాచిక ఆనందం పొందేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
తాజాగా వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లేది లేదని నిర్ణయం తీసుకోవడంపై స్పందించారు. అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. అది జగన్ మోహన్ రెడ్డి అయినా... వైసిపి ఎంఎల్ఏ లు అయినా..ఎవరైనా రాజీనామా చేయాలి. అసెంబ్లీ వెళ్ళే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు అని అన్నారు.
అసెంబ్లీ కి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాలి
వైఎస్ షర్మిలా రెడ్డి
అసెంబ్లీ కి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాలి
అది జగన్ మోహన్ రెడ్డి అయినా... వైసిపి ఎంఎల్ఏ లు అయినా..ఎవరైనా రాజీనామా చేయాలి
అసెంబ్లీ వెళ్ళే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు#YSsharmila #Assembly #Aadhantelugu pic.twitter.com/81eDrqnSCm
— Aadhan Telugu (@AadhanTelugu) November 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)