నీటి కొరత బెంగుళూరు నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు (Bengaluru Water Crisis) పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు.తన ఇంటి వద్ద ఉన్న బోరు బావి కూడా ఎండిపోయిందని (Borewell At My Home Also Dry) తెలిపిన డిప్యూటీ ముఖ్యమంత్రి.. నగరంలో రోజురోజుకీ నీటి కొరత తీవ్రతర అవుతుందని, దాదాపు 3000 పైగా బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు.  డికె శివకుమార్ మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు, అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపిన అత్యున్నత ధర్మాసనం

నీటి సమస్యను (Deepening Water Shortage) తీర్చడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా సరాఫరా చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు. నగరంలో నీటి కొరతకను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోనీ బీజేపీ కూడా కారణమేనంటూ శివకుమార్‌ విమర్శించారు. బెంగుళురుకు మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు తాము శ్రీకారం చుట్టామని.. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)