బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. సమస్తిపూర్ వద్ద ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై నిపుణుల బృందం దర్యాఫ్తును ప్రారంభించింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, తప్పిన పెను ప్రమాదం,నిర్లక్ష్యమే కారణమా?.. వీడియో వైరల్
ప్రమాద సమయంలో రైలు తక్కువ వేగంతో వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సుమారు గంట పాటు శ్రమించి విడిపోయిన బోగీలను ఇంజిన్‌కు కనెన్ట్ చేసినట్లు తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చంద్ర తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను నిపుణుల బృందం పరీశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Here's Video
Samastipur, Bihar: A major rail accident was narrowly avoided in Samastipur when the Bihar Sampark Kranti Express, traveling from Darbhanga to New Delhi, split into two parts with the coaches detaching from the engine. Railway officials quickly arrived at the scene near Khudiram… pic.twitter.com/LJyCE18cqt
— IANS (@ians_india) July 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)