ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి కాన్వాయ్‌పై నక్సల్స్ కాల్పులు జరిపారు. బీజాపూర్ జిల్లాలోని పడెడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చోటు చేసుకోగా.. ఎమ్మెల్యే తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కాన్వాయ్‌లో ఉన్న జిల్లా పంచాయతీ సభ్యురాలు పార్వతి కశ్యప్ వాహనంపై సైతం కాల్పులు జరిపారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కాన్వాయ్‌లో ఉన్న వారంతా సురక్షితంగా పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. కాల్పులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా గతంలో ఏప్రిల్ 2019లో దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు వాహనాన్ని పేల్చివేయడంతో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి, నలుగురు పోలీసులు చనిపోయారు. ఎమ్మెల్యే వాహనాన్ని ఐఈడీ పేల్చడంతో సంఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడింది. మరో వైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో వారం వ్యవధిలో ముగ్గురు బీజేపీ నేతలను మావోయిస్టులు హతమార్చారు.
Here's Update
#Congress MLA Vikram Mandavi alleged that shots were fired at his convoy in a village in the insurgency-hit #Bijapur district of #Chhattisgarh. Read more here.#maoist https://t.co/1A10MX0MfI
— The Telegraph (@ttindia) April 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)