దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన విజృంభించింది. సోమవారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన ధాటికి జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లుపడ్డారు. విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ల్యాండింగ్‌ సమస్యను ఎదుర్కొన్నాయి.అధికారుల నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. ఇక భీకర గాలుల కారణంగా రోడ్డుపై వెళ్తున్న కార్లు సైతం వణికాయి. పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలపై చెట్లు కూలడంతో ధ్వంసమయ్యాయి. ఏపీ భవన్‌లో ఈదురు గాలులు బెంబేలెత్తించాయి. గాలుల వేగానికి నగరంలోని పలు కార్యాలయాల్లో అద్దాలు పగలిపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ట్విటర్‌లో ట్రెండ్‌ అయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)