గుజరాత్‌ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ లో ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అమ్రేలి ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని.. సైకిల్‌కి సిలిండర్‌ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు. ఇలా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నది.ఇక తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)