భారత ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు కమిషనర్ల నియామకమయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్‌ జ్ఞానేష్‌కుమార్‌, పంజాబ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుఖ్‌భీర్‌ సింగ్‌ సంధును ఎంపిక చేశారు. కాగా గత నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల రాజీనామాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఈసీఐలో మిగిలారు. తాజాగా ఇద్దరు కమిషనర్లను సెలక్షన్ కమిటీ నియమించింది. రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)