హర్యానాలోని యుమునా నగర్‌ (Yamuna Nagar) జిల్లాలో కల్తీ మద్యం తాగి (Alcohol) ఆరుగురు యువకులు మరణించారు. మందేబరి ప్రాంతంలో మద్యం తాగిన ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు ఆస్పత్రికు తరలించారు. అయితే చికిత్స పొందుతుండగా వారు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పలువురు నిందితులను గుర్తించామని, వారిలో కొందరిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ గంగా రామ్‌ పునియా (SP Ganga Ram Punia)చెప్పారు. మద్యం సేవించినవారిలో ఐదుగురు గ్రామంలోనే మరణించారని ఎస్పీ తెలిపారు. మరొకరు ఆస్పత్రిలో మృతిచెందారని, ఇంకో వ్యక్తి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు కొన్ని ఆధారాలను సేకరించామన్నారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)