దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,55,749కి చేరాయి. ఇందులో 4,26,13,440 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,24,611 మంది మరణించగా, 17,698 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 25 మంది మృతిచెందారని, 2070 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 1,93,13,41,918 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 85,00,77,409 నమూనాలను పరీక్షించామని, ఆదివారం ఒక్కరోజే 2,78,267 మందికి పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్ తెలిపింది.
India records 2,706 new COVID19 cases today; Active cases stand at 17,698 pic.twitter.com/xF4GxC6yoP
— ANI (@ANI) May 30, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)