ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి పాకిస్థాన్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ డ్రోన్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ సాధారణ నిఘా మిషన్‌లో పాల్గొన్నది. అయితే కంట్రోల్‌ కోల్పోయిన ఆ డ్రోన్‌ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను దాటి పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించింది.అక్కడ దిగిన ఆ డ్రోన్‌ను పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) స్థాయి అధికారులతో ఇండియన్‌ ఆర్మీ అధికారులు ఈ సంఘటనపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తున్నది. యూపీలో కూలిన ప్రైవేట్ స్కూల్‌ బిల్డింగ్‌, 40 మంది విద్యార్థులకు గాయాలు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)