రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్. రైళ్ల‌లో ఏసీ కోచ్‌లలో మ‌ళ్లీ బ్లాంకిట్స్, దుప్ప‌ట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విష‌యాన్ని రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. క‌రోనా కార‌ణంగా రెండేళ్లుగా రైల్‌లో ఉన్న ఈ సౌల‌భ్యాన్ని కేంద్రం తొల‌గించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌ధ్యంలో బెడ్‌షీట్స్‌, బ్లాంకెట్స్‌తో పాటు క‌ర్టెయిన్ల‌ను కూడా తిరిగి అందుబాటులోకి తేనున్నారు. వీటికి సంబంధించిన ఉత్త‌ర్వులు కింది స్థాయి అధికారుల‌కు జారీ చేశారు. ఇక‌.. ఇప్ప‌టికే వీటిని పంపిణీ చేయ‌డం ప్రారంభించామ‌ని అధికారులు పేర్కొంటున్నారు. కేవ‌లం 638 ఎంపిక చేసిన రైళ్ల‌కే ఈ సౌల‌భ్యాన్ని పునరుద్ధ‌రించామ‌ని,ఈ జాబితాలో లేని రైళ్ల‌లో మాత్రం ప్ర‌యాణికులే బ్లాంకెట్లు, దుప్ప‌ట్లు తెచ్చుకోవాల‌ని రైల్వే విజ్ఞ‌ప్తి చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)