బెంగళూరు మెట్రో స్టేషన్‌లో సిబ్బంది రైతును అవమానించారు. ప్రజా రవాణా సంస్థ ‘నమ్మ మెట్రో’లోకి రైతును వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. నాసిరకం బట్టలు వేసుకున్నాడని మెట్రో ఎక్కకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.ఈ ఘటనను వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. మెట్రో ఉద్యోగి రైతును లోనికి అనుమతించకపోవడంతో ఆగ్రహం చెందిన తోటి ప్రయాణికులు.. ఉద్యోగులతో సంబంధం లేకుండా రైతును మెట్రోలోకి ఎక్కించారు. రైతును అవమానిస్తున్న మెట్రో ఉద్యోగి తీరును ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో బంధించాడు. మురికి బట్టలు వేసుకున్నాడని రైతును మెట్రో ఎక్కకుండా అడ్డుకున్న సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడిన తోటి ప్రయాణికులు, ఘటనపై బెంగుళూరు మెట్రో స్పందన ఇదే..

వీడియో వైరల్ కావడంతో ఆ ఉద్యోగిని సర్వీస్ నుండి BMRCL తొలగించింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) దీనిపై వివరణ ఇస్తూ.. నమ్మ మెట్రో అనేది ప్రజా రవాణా. రాజాజీనగర్‌లో జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ క్షమాపణలు చెప్పింది.

Here's Video

Here's Namma Metro Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)