కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని ఇల్కల్ పట్టణంలో హెయిర్ డ్రైయర్ పేలడంతో మహిళ రెండు చేతులకు మోచేతుల వరకు గాయాలయ్యాయి. హెయిర్ డ్రైయర్‌ని పరిశీలిస్తున్న సమయంలో అది పేలడంతో బసమ్మ యారనల్ అనే బాధితురాలు తీవ్రంగా గాయపడింది.పేలుడు తీవ్రతకు బసమ్మ చేతి వేళ్లు పగిలిపోయాయి. ముంజేతులు వరకు తీవ్రగాయాలయ్యాయి, ఇళ్లంతా రక్తంతో నిండిపోయింది. పొరుగుంటిలోని శశికళకు వెళ్లాల్సిన హెయిర్ డ్రైయర్ పార్సిల్‌ని ఆమె లేకపోవడంతో బసమ్మ తీసుకుంది.

ఇంత దారుణమా, ప్రాణం పోతోంది రక్షించమని వేడుకున్నా సాయం చేయని జనం, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం

శశికళ, బసమ్మ ఇద్దరూ కూడా మరణించిన సైనికుల భార్యలు. బసమ్మ హెయిర్ డ్రైయర్ ఎలా పనిచేస్తుందో చూడాలనే కుతూహాలంతో ఉపయోగించిందని పోలీసులు తెలిపారు. ఆమె కనెక్షన్‌ ఇచ్చి ఉపయోగించిన కొద్ది క్షణాలకే భారీ శబ్ధంతో డ్రైయర్ పేలిపోవడంతో తీవ్రగాయాలపాలైంది.ఇల్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు బాగల్‌కోట్ ఎస్పీ అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు.ఈ హెయిర్ డ్రైయర్‌ని తయారు చేసిన చైనీసీ కంపెనీ కెమీ హెయిర్ డ్రైయర్ అని పోలీస్ అధికారి చెప్పారు.

Soldier's wife lost both hands in hair dryer explosion

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)