కేరళ రాజధాని తిరువనంతపురంలోని సీపీఎం (CPM) పార్టీ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో స్కూటర్‌పై వచ్చిన ఓ వ్యక్తి పార్టీ ఆఫీస్‌పై బాంబు విసిరాడు. ఈ దృష్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ దాడిలో ఎవరు గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకేజీ సెంటర్‌లో ఉంటున్న కొందరు పార్టీ నాయకులు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని తెలిపారు. దీంతో బయటకు వచ్చిన నాయకులు అది తమ పార్టీ ఆఫీసు కాంపౌండ్‌ గోడ వద్దే జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉన్నదని కమ్యూనిస్ట్‌ నేతలు ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)