పార్లమెంట్‌పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ లోక్‌సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు టియర్‌ గ్యాస్‌ వదిలారు. దీంతో సీట్లలో ఉన్న ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. జీరో అవర్‌ కొనసాగుతుండగా ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

లోక్‌సభ లోపల పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన సాగర్‌ శర్మ, దేవ్‌రాజ్‌లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మైసూర్‌కు చెందిన వారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లో టియర్ గ్యాస్‌తో హడావుడి చేశారో, వాళ్లు బీజేపీ నాయకుడు మైసూర్‌ ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం ద్వారా పాస్‌లు పొందినట్టు తెలుస్తోంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)