ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు ఎదురొచ్చే యత్నం చేశాడు . అయితే.. అది గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దావణగెరెలో ప్రధాని మోదీ రోడ్‌షో లో ప్రజలకు అభివాదం చేస్తూ వాహనంలో ముందుకు కదిలారు.
ఆ సమయంలో బారికేడ్లను దూకేసిన ఓ యువకుడు ప్రధాని ప్రయాణిస్తున్న కాన్వాయ్ వైపు అకస్మాత్తుగా దూసుకొచ్చే యత్నం చేశాడు. అది గమనించిన స్థానిక పోలీసులు, పీఎం సెక్యూరిటీ సిబ్బంది.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిది కొప్పాల్ అని, అతడు బీజేపీ కార్యకర్తగానే గుర్తించారు పోలీసులు. ఈ ఏడాది జనవరిలో ఇదే కర్ణాటకలో హుబ్బళి వద్ద ప్రధాని మోదీ రోడ్‌షోలో.. ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
Here's Video
#WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police.
(Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz
— ANI (@ANI) March 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)