తమిళనాడు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో 13 జిల్లాలకు వర్ష హెచ్చరికను చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఆదివారం రాత్రి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అదేవిధంగా సోమవారం కూడా చెన్నై, మదురై, కోయంబత్తూరు(Chennai, Madurai, Coimbatore)తో పాటు 13 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపు జల్లులు కురిశాయి.

శ్రీలంకతో పాటు కన్నియాకుమారి సముద్రతీరంపై ఆవహించివున్న బాహ్య ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌(Tamil Nadu, Puducherry, Karaikkal) ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నిరుద్యోగులకు నెలకు రూ. 6 వేలు ఇస్తున్న మోదీ సర్కారు, వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని తెలిపిన PIB

అదేవిధంగా నవంబరు 1, 2 తేదీల్లో దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో తంజావూరులో గరిష్ఠంగా 70 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. రామనాథపురం జిల్లాలో కడలాడి, కన్నియాకుమారి జిల్లాలో కుళచ్చల్‌ ప్రాంతాల్లో 60 మి.మీ. వర్షపాతం నమోదైంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)