టీ20 వరల్డ్‌కప్‌-2024 సూపర్‌-8లో​ భాగంగా సెయింట్‌ లూసియా వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్‌ మ్యాచ్ లో సఫారీలు 7 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఉత్కంఠ భరితో పోరులో ఇంగ్లండ్ బ్యాటర్లు చివరి ఓవర్లలో విరుచుకుపడినా టార్గెట్ చేధించడంలొ విఫలమవ్వడంతో ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సౌతాఫ్రికా చేతిలో USA చిత్తు...18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించిన సౌతాఫ్రికా..

సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. డికాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఇంగ్లీష్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు డేవిడ్‌ మిల్లర్‌ మెరుపులు మెరిపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న మిల్లర్‌ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేశాడు. అనంతరం స‌ఫారీలు నిర్దేశించిన‌ ఛేద‌న‌లో ఇంగ్లండ్ టాపార్డ‌ర్ త‌డ‌బ‌డింది. స్పిన్న‌ర్ కేశ‌మ్ మ‌హ‌రాజ్ విజృంభ‌ణ‌తో బ‌ట్ల‌ర్ సేన‌ 61 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయింది.హ్యారీ బ్రూక్(43), లియం లివింగ్‌స్టోన్‌(16)లు పోరాడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)