త‌మిళ‌నాడులోని కూనూర్ వ‌ద్ద హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌పై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu Chief Minister MK Stalin) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో (IAF Helicopter Crash) గాయ‌ప‌డిన‌వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు. స‌హాయ కార్య‌క్ర‌మాల్లో వాయుసేన‌, సైనిక సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

ఈ ఘ‌ట‌న‌లో  అయిదుగురు మ‌ర‌ణించ‌గా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ రోజు సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చెన్నై నుండి కోయంబత్తూరుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి నీలగిరికి చేరుకుని ప్రమాద పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు.

ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌ బుధ‌వారం న‌లూర్ నుంచి వెల్లింగ్ట‌న్‌కు వెళుతుండ‌గా కూనూర్ వ‌ద్ద కుప్ప‌కూలింది. ఈ విమానంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ బిపిన్ రావ‌త్‌, ఆయన భార్య‌తో పాటు 14 మంది ప్ర‌యాణిస్తున్నారు. హెలికాఫ్ట‌ర్ కూలిన స‌మ‌యంలో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ‌మంచు అలుముకుంది. ప్ర‌మాద ఘ‌ట‌నపై వాయుసేన ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)