యూపీలోని లక్నోలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.అయితే అరెస్ట్ చేసిన తరువాత నేను రానంటూ మారాం చేశాడు. ఇటీవలి ఆపరేషన్‌లో అవినీతి నిరోధక బృందం లక్నో తహసీల్ సదర్‌లో పనిచేస్తున్న అవినాష్ ఓజా అనే అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

ప్రస్తుతం రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఓజా భూమి కొలతల కోసం రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముఖ్యంగా, అతను ఇటీవలే రాయ్‌బరేలీ నుండి లక్నో తహసీల్ సదర్‌కు బదిలీ చేయబడ్డాడు. అవినీతి నిరోధక బృందం ఈ అరెస్టును బహిరంగంగా నిర్వహించింది, వ్యవస్థలోని అవినీతి సమస్యను వెలుగులోకి తెచ్చింది. అరెస్టును ప్రతిఘటిస్తూ భౌతికంగా ఈడ్చుకెళ్లి బలవంతంగా కారులోకి ఎక్కించారు. నీవు రాకపోతే ఈడ్చుకుపోతామంటూ ఏసీబీ అధికారులు అ అవినీతి అధికారిని లాక్కెళ్లి పోతున్న వీడియో ఇదిగో..

Lucknow officer caught by the ACB officials while taking bribe

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)