ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ మంగళవారం ఉదయం దుర్గ్‌ జిల్లాలోని జజంగిరి గ్రామంలో గోవర్ధన్‌ పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తిన్నారు. ముందుగా ఆలయంలో గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తుల లాగానే కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోయి, శుభం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.కాగా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో భక్తులు పాల్గొని కొరడా దెబ్బలు తింటారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)