కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ సంచలన కామెంట్స్‌ చేశారు. కర్నాటకలో ప్రచారంలో భాగంగా హుబలి సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ క‌ర్నాట‌క ప్ర‌తిష్ట‌, సార్వ‌భౌమ‌త్వానికి, స‌మ‌గ్ర‌త‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా కాంగ్రెస్ చూస్తుంద‌ని.. ఇందుకు భంగం కలిగించే వారిని ఎవరిని అనుమతించబోమని కామెంట్స్‌ చేశారు. అనంతరం, సోనియా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు.

సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సార్వ‌భౌమ‌త్వం అన్న ప‌దాన్ని వాడ‌డం ప‌ట్ల బీజేపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ నేప‌థ్యంలో ఈసీకి ఓ లేఖ రాసింది. సోనియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఈసీని బీజేపీ కోరింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)