కర్ణాటకలోని అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కావడానికి రూ.2,500 కోట్లు ఇవ్వాలని తనను అడిగారని ఆరోపించారు. కొందరు ఏజెంట్లు ఈ మొత్తం డిమాండ్‌ చేశారని తెలిపారు. శుక్రవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘రాజకీయాల్లో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. డబ్బులతో పదవుల ఆశ చూపే దొంగలను నమ్మకూడదు. పార్టీ టికెట్‌ ఇప్పిస్తాం, సోనియా గాంధీ లేదా జేపీ నడ్డాతో సమావేశం ఏర్పాటు చేస్తాం అంటూ కొందరు ఆశ్రయిస్తుంటారు.

అలాంటి వారు నా వద్దకు కూడా ఒకసారి వచ్చారు. రూ.2500 కోట్లు ఇస్తే సీఎం చేస్తామన్నారు. రూ.2500 కోట్లు అంటే వారు ఏమని అనుకుంటున్నారని నేను ఆలోచనలో పడ్డాను. అంత డబ్బు ఎక్కడ ఉంచుతారు? అన్నది నాకు అర్థం కాలేదు. అందువల్ల ఇలా టికెట్లు, పదవుల ఆశ చూపే కంపెనీలు పెద్ద స్కామ్‌’ అని అన్నారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ స్పందించారు. ఆయన చేసిన ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది జాతీయ అంశమని, తప్పక దర్యాప్తు చేయాల్సిందేనని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)