పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

అధికార కాంగ్రెస్‌ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్‌ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో పాగా వేయనున్నారు. ఇతర సర్వేలు కూడా ఆమ్ ఆద్మీ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని పోల్‌ సర్వేలో తెలిపాయి.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ 117 స్థానాలకు గాను ఆప్ 76 నుంచి 90 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఓట్ల శాతాన్ని పరిగణన లోకి తీసుకుంటే ఆమ్‌ ఆద్మీ పార్టీకి 40 శాతం ఓట్‌ షేర్‌ రానుంది. కాంగ్రెస్‌ పార్టీకి 30 శాతం, అకాలీదళ్‌కు 20 శాతం, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)