Ponmudy sworn in again as TN minister: తమిళనాడుకు చెందిన డీఎంకే నేత పొన్ముడి ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణం చేశారు.పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సుప్రీంకోర్టు అక్షింతలతో దిగి వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా హాజరయ్యారు.

అక్రమాస్తుల కేసులో పొన్ముడికి గతంలో జైలుశిక్ష పడటంతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయింది. తమిళనాడు హైకోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పొన్ముడి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు హైకోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో పొన్ముడి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తమిళనాడు స్పీకర్‌ ప్రకటించారు. సీఎం స్టాలిన్‌ పొన్ముడి పేరును మంత్రిగా సిఫారసు చేశారు. అయితే అందుకు గవర్నర్‌ నిరాకరించారు. దాంతో స్టాలిన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టాలిన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..తాము ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)