Newdelhi, Oct 20: రెడ్‌ మీట్‌ (Red Meat) (మటన్‌, బీఫ్‌)ను అతిగా తింటే టైప్‌-2 డయాబెటిస్‌ (Type-2 Diabetes) బారినపడతారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వారంలో రెండు సార్లు, అంతకంటే ఎక్కువగా రెడ్‌ మీట్‌ ను తినేవారు టైప్‌-2 డయాబెటిస్‌ బారినపడే అవకాశం అధికంగా ఉందని కేంబ్రిడ్జ్‌ లోని హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 2,16,695 మంది ఆరోగ్య డాటాను విశ్లేషించిన పరిశోధకులు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.36 ఏండ్ల డాటాను విశ్లేషించిన పరిశోధకులు 22 వేల మందికి పైగా టైప్‌-2 డయాబెటిస్‌ బారినపడినట్టు గుర్తించారు. అతిగా రెడ్‌ మీట్‌ తినేవారు టైప్‌-2 డయాబెటిస్‌ బారినపడే ప్రమాదం 62 శాతం పొంచి ఉందని పరిశోధకులు తెలిపారు.

Viral News: బొమ్మలా నిలబడి నగల షాపులో యువకుడు చోరీ.. పోలాండ్‌ లోని వార్సా నగరంలో ఘటన.. చివరికి ఏమైంది??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)