కేరళలో ఏనుగు బీభత్సం( Elephant Attack) సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి(Kerala Elephant Attack) చెందగా 36 మందికి గాయాలు అయ్యాయి. కోజికోడ్ జిల్లా కోయిలండిలో విషాదం నెలకొంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా పెద్దఎత్తున టపాసులు పేల్చారు.

ఆ శబ్దాలకు భయపడిన పీతాంబరం, గోకుల్ అనే 2 ఏనుగులు ఒక్కసారిగా పరిగెత్తడంతో వాటి కింద పడి ముగ్గురు(3 Dead) చనిపోగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన తర్వాత వాటిని మచ్చిక చేసుకోవడానికి 2 గంటలు పట్టిందని స్థానికులు చెప్పారు.

దారుణం, భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే పడుకున్న కసాయి భర్త, తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన నిందితుడు..

ఇక మరో ఘటనలో త్రిపుర లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జరిగింది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త క్షణాకావేశంలో భార్య ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్‌స్టేషన్‌ పరధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు భార్యను హత్య చేసిన అనంతరం రాత్రంతా ఆ మృతదేహంతో ఇంట్లోనే గడిపాడు.

 Elephant attack at Kerala, Three dead, 36 injured 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)