కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని చిత్తర్ నదిలో ఉబ్బెత్తుగా ఉన్న బండరాయిపై చిక్కుకుపోయిన వృద్ధుడు, మహిళతో సహా నలుగురిని అగ్నిమాపక దళం సిబ్బంది సాహసోపేతంగా మంగళవారం రక్షించారు. నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో, కర్నాటకకు చెందిన నలుగురు, ఆ రాతిపై చిక్కుకున్నారు. నదిలో స్నానానికి దిగిన వృద్ధ తల్లి, తండ్రి, ఇద్దరు పెద్ద కొడుకులు నది మధ్యలో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా మూలతర రెగ్యులేటర్‌ తెరిచి నదిలో నీరు చేరింది. దీంతో నది మధ్యలో ఉన్న బండపై నలుగురు ఇరుక్కుపోయారు.  భారీ వరదలకు నీట మునిగిన శ్రీ మహదేవ ఆలయం, భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్న అర్చకులు, వీడియో ఇదిగో

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారికి లైఫ్ జాకెట్లు తొడిగించిన తర్వాత నలుగురిని తాడుతో కట్టి మరీ సాహసం చేసి బయటకు తీసుకొచ్చారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలక్కాడ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న మూడు గంటల్లో పాలక్కాడ్‌తో సహా ఆరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈరోజు పాలక్కాడ్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)