కర్ణాటక రాష్ట్రంలోపి బళ్లారి జిల్లా మెట్రి పంచాయతీ పరిధిలోని ఉప్పారహళ్లి గ్రామంలో కాడప్ప అనే యువకుడికి ఆదివారం నాగుపాము కాటేసింది. దీంతో కంగారు పడకుండా కాడప్ప పామును పట్టుకుని మెట్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ యువకుడి సాయంతో ద్విచక్ర వాహనంలో కంప్లి ఆస్పత్రికి చేరుకున్నాడు. అక్కడ పాము చేతపట్టుకుని ఆస్పత్రికి వస్తున్న కాడప్పను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు భయపడ్డారు. వైద్యులు హుటాహుటిన ప్రాథమిక చికిత్స చేసి బళ్లారి విమ్స్‌కు తరలించారు.
A youth walked into PHC in #Kampli taluk with a cobra which had bitten him. Being treated at VIMS in #Ballari Snake was released back to nature @santwana99 @ramupatil_TNIE @BoskyKhanna @KiranTNIE1 @XpressBengaluru @KannadaPrabha @NammaKalyana @karnatakacom @NammaBengaluroo pic.twitter.com/T0w2lSFhFz
— Amit Upadhye (@Amitsen_TNIE) June 13, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)